భారత్ సమాచార్, కర్నూలు జిల్లా: కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ మున్సిపల్ కార్మికుల సమస్యలపై గళమెత్తుతూ ఎమ్మిగనూరు పట్టణంలో సీఐటీయూ మున్సిపల్ కార్మిక సంఘం ఆధ్వర్యంలో సోమవారం ఉదయం 5.30 గంటలకు జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. మున్సిపల్ కార్మిక సంఘం అధ్యక్షులు జే. నాగరాజ్ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. 20 ఏళ్లుగా పనిచేస్తున్న కార్మికులను రెగ్యులరైజేషన్ చేయకుండా ప్రభుత్వాలు కాలయాపన చేస్తున్నాయని విమర్శించారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.…