భారత్ సమాచార్, కర్నూలు జిల్లా: ఎమ్మిగనూరు, గోనెగండ్ల పరిధిలో మూతపడిన ఎస్సీ హాస్టళ్లను వెంటనే పునఃప్రారంభించాలని బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ), బహుజన స్టూడెంట్ ఫెడరేషన్ (బీఎస్ఎఫ్) నాయకులు కర్నూలు జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారిని కలిసి వినతిపత్రం అందజేశారు. విద్యార్థుల చదువు విషయంలో రాజీ లేదని బీఎస్పీ నేతలు స్పష్టం చేస్తూ, అధికారులు నిర్లక్ష్యం వహిస్తే ఉద్యమాలు, కలెక్టరేట్ ముట్టడి చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ, బీఎస్ఎఫ్ నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
మూతపడిన ఎస్సీ హాస్టళ్లను పునఃప్రారంభించాలి: బీఎస్పీ





