భారత్ సమాచార్, కర్నూలు జిల్లా: విద్యుత్ వినియోగదారుల సమస్యలకు తక్షణ పరిష్కారం అందించేందుకు ఏపీఎస్‌పీడీసీఎల్ ఆధ్వర్యంలో ‘కరెంటోళ్ల జనబాట’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ సిరి తెలిపారు. సోమవారం కలెక్టరేట్లో ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. ప్రతి మంగళవారం, శుక్రవారం గ్రామాలు, పట్టణ వార్డుల్లో విద్యుత్ సరఫరా సంబంధిత సమస్యలను గుర్తించి వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడమే ఈ కార్యక్రమం లక్ష్యమని కలెక్టర్ పేర్కొన్నారు. విద్యుత్ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో ప్రజలతో నేరుగా మాట్లాడి సమస్యలను తెలుసుకోవాలని…
కరెంటోళ్ల జనబాటకు కలెక్టర్ శ్రీకారం





