భారత్ సమాచార్, మెదక్ జిల్లా: మహిళా సాధికారతకు కాంగ్రెస్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని, మెదక్ జిల్లాలో మహిళా పెట్రోల్ బంక్ కోసం స్థల సేకరణ జరుగుతుందని, రాష్ట్రవ్యాప్తంగా బ్యాంకు లింకేజీ ద్వారా రూ.23 వేల కోట్ల రుణాలు ఇచ్చామని మంత్రి వివేక్ వెంకటస్వామి పేర్కొన్నారు. నర్సాపూర్ మున్సిపాలిటీలోని 157మహిళా సంఘాలకు రూ.66,93,541 వడ్డీలేని రుణాల వడ్డీ డబ్బులు పంపిణీ చేశామన్నారు. మెదక్ జిల్లా వ్యాప్తంగా రూ.3,09,46,721 వడ్డీ లేని రుణాలకు వడ్డీ పంపిణీ చేయడం జరిగిందని కార్మిక ,గనుల శాఖ, జిల్లా ఇంచార్జి…