భారత్ సమాచార్, నిజామాబాద్ జిల్లా: బోధన్ మండలం బెల్లాల్ గ్రామంలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ ఉత్సాహంగా సాగింది. గ్రామ యువత పెద్ద సంఖ్యలో పాల్గొని తమ క్రీడా ప్రతిభను ప్రదర్శించారు. ఈ టోర్నమెంట్‌ను వీరాగౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించగా, గ్రామ సర్పంచ్ రాజు ముఖ్య అతిథిగా హాజరై క్రీడాకారులను ప్రోత్సహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, క్రీడలు యువతలో క్రమశిక్షణ, ఆరోగ్యం, ఐక్యతను పెంపొందిస్తాయని అన్నారు. గ్రామస్థాయిలో ఇలాంటి క్రీడా పోటీలు నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. వార్డు మెంబర్లు కూడా కార్యక్రమంలో పాల్గొని నిర్వహణకు…
బెల్లాల్ గ్రామంలో క్రికెట్ టోర్నమెంట్ విజయవంతం





