భారత్ సమాచార్, చిత్తూరు జిల్లా: ప్రముఖ సాహితీవేత్త, విమర్శకులు, కవి చందు సుబ్బారావు (విశాఖపట్నం) ఆకస్మిక మరణం పట్ల పలమనేరు రచయితల సంఘం తెలుగు సాహిత్య సాంస్కృతిక సమితి తెలకోవెల నిర్వాహకులు ఆర్.మాధవ్, పలమనేరు బాలాజి, పి.తులసినాధం నాయుడు, పుష్ప, జొన్నవిత్తుల శ్రీరామచంద్రమూర్తి, రచయితలు డాక్టర్ మల్లిచెట్ల దేవేంద్ర, దోర్నాదుల సిద్ధార్థ, గండికోట వారిజ, చంద్రశేఖరయ్య తదితరులు సంతాపాన్ని తెలియజేశారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ప్రొఫెసరుగా మార్క్సిస్టు రచయితగా భూభౌతిక శాస్త్రవేత్తగా, అభ్యుదయ రచయితల సంఘంలో క్రియాశీలక సభ్యులుగా ఆయన స్త్రీవాద రాజకీయ, శాస్త్రీయ అంశాలపై…