భారత్ సమాచార్, కర్నూలు జిల్లా: ఎమ్మిగనూరు ఎన్జీఓ భవనంలో నిర్వహించిన APNGOs అసోసియేషన్ తాలూకా ఎన్నికలు ఎలాంటి పోటీలు లేకుండా ఏకగ్రీవంగా ముగిశాయి. ఎన్నికల అధికారులుగా బ. కోదండరామయ్య, సహాయక అధికారిగా .సాయిబాబా పర్యవేక్షించగా, మొత్తం 11 పదవులకు 11 నామినేషన్లు రావడంతో ఏకగ్రీవంగా ప్రకటించారు. ఈ సందర్భంగా కొత్త కమిటీకి ప్రమాణ స్వీకారం నిర్వహించారు. రాష్ట్ర నాయకత్వం బలపడేలా, ఉద్యోగుల సమస్యలపై చురుకుగా కార్యకలాపాలు చేపట్టాలని ఎన్నికల అధికారులు సూచించారు. కార్యక్రమానికి ఉద్యోగులు భారీగా హాజరయ్యారు.