భారత్ సమాచార్, అల్లూరి జిల్లా: రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో కలిసిన ఎటపాకను మండల కేంద్రంగా ఏర్పాటు చేసిన తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో సిఎస్ఐ వారు ఎటపాక గ్రామంలో నిర్వహించిన పాఠశాలను మధ్యంతరంగా బాధ్యతలు నుండి తప్పుకోవడం వలన మండల కేంద్రంలో సరైన పాఠశాల లేకుండా పోయిందని స్థానిక పెద్దలు అన్నారు. ఈ ప్రాంత విద్యార్థులు చదువులకు దూరంగా ఉంటున్నారని, ఎటపాకకు ఆనుకుని ఉన్న భద్రాచలం చదువుకోవాలంటే తెలంగాణ ప్రాంతానికి చెందినది కనుక స్థానికత సమస్య వల్ల విద్యార్థులు చదువులకు దూరం అవుతున్నారని అన్నారు.…