భారత్ సమాచార్.నెట్, కర్నూలు: మద్దికేర మండలం పెరవలి గ్రామంలోని శ్రీరంగనాథస్వామి ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ముగిశాయని ఆలయ ఈవో రెబ్బా వీరయ్య తెలిపారు. చివరి రోజు, శ్రీరాజ్యలక్ష్మి అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి దేవి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. సాయంత్రం, శ్రీరంగనాథస్వామి ఉత్సవ మూర్తులను పల్లకిలో ఊరేగింపుగా మేళతాళాలతో గ్రామ శివారులోని జమ్మిచెట్టు వద్దకు తీసుకెళ్లారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తులకు తీర్థప్రసాదాలు అందించారు. ఈ కార్యక్రమంలో ధర్మకర్తల మండలి అధ్యక్షుడు పారా రవికుమార్, సభ్యులు, భక్తులు పెద్ద…
రాజరాజేశ్వరి దేవి రూపంలో దర్శనమిచ్చిన అమ్మవారు





