భారత్ సమాచార్, కర్నూలు జిల్లా: ఆదోని మండలం గనేకల్ గ్రామంలో శ్రీ బంగారమ్మ దేవర వేడుకలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గుడిసె ఆది కృష్ణమ్మ బంగారమ్మ దేవతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆదోని ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో సమృద్ధిగా వర్ధిల్లాలని ఆమె కోరారు. గ్రామ అభివృద్ధి, ప్రజల శ్రేయస్సే లక్ష్యంగా నిరంతరం కృషి చేస్తామని తెలిపారు. ఈ వేడుకల్లో గ్రామ పెద్దలు, మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని దేవర కార్యక్రమాన్ని ఘనంగా జరిపారు.