భారత్ సమాచార్, మెదక్ జిల్లా: రామాయంపేట మండల కేంద్రంలో మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనాంపల్లి రోహిత్ రావు పర్యటించారు. స్థానిక మెదక్ చౌరస్తాలో రజక సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన తెలంగాణ వీరనారి, సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ విగ్రహాన్ని అయన ఆవిష్కరించారు. తెలంగాణ సాయుధ పోరాటంలో చాకలి ఐలమ్మ చేసిన పోరాటాన్ని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం నాయకులు, రజక సంఘం నాయకులు, వివిధ గ్రామాల నుంచి వచ్చిన రజక సంఘం నాయకులు, కాంగ్రెస్ నాయకులు సుప్రభాత రావు,…