భారత్ సమాచార్, కర్నూలు జిల్లా: గ్రామీణ ఉపాధి హామీ పథకానికి మహాత్మా గాంధీ పేరును యథావిధిగా కొనసాగించాలని, అలాగే ఉపాధి హామీ పథకానికి కేంద్ర ప్రభుత్వం 90 శాతం నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ బుధవారం గోనెగండ్ల సీపీఐ మండల సమితి ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ నాయకులు మాట్లాడుతూ.. ఉపాధి హామీ పథకం గ్రామీణ పేదలకు జీవనాధారంగా మారిందని, పథకాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నాలను తక్షణమే విరమించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. అనంతరం తమ…