భారత్ సమాచార్, మెదక్ జిల్లా: తూప్రాన్ పట్టణంలో ఆత్మహత్యకు ప్రయత్నించిన తల్లి కూతురిని డయల్–100 ద్వారా సకాలంలో స్పందించి రక్షించిన తూప్రాన్ పోలీస్ కానిస్టేబుళ్లు రవి, శ్రీకాంత్‌లను జిల్లా ఎస్పీ డీవీ. శ్రీనివాసరావు అభినందించి, క్యాష్ రివార్డ్‌తోపాటు ప్రశంసా పత్రాలతో సత్కరించారు. డయల్–100కు వచ్చిన సమాచారంపై వెంటనే స్పందించి ప్రమాద స్థలానికి చేరుకుని మానవత్వంతో వ్యవహరించి ఇద్దరి ప్రాణాలను కాపాడిన సిబ్బంది సేవలు ప్రశంసనీయమని జిల్లా ఎస్పీ శ్రీనివాస రావు తెలిపారు. ఇలాంటి అప్రమత్తత, అంకితభావం ప్రతి పోలీస్ సిబ్బందిలో ఉండాలని సూచించారు. ప్రజల…