భారత్ సమాచార్, మెదక్ జిల్లా: వెల్దుర్తి మండల కేంద్రంలోని శ్రీమతి రాయారావు సరస్వతి మెమోరియల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఆదివారం ప్రకటించిన ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. కళాశాల టాపర్లుగా నిలిచిన విద్యార్థులను ప్రిన్సిపాల్ బి. శ్రీనివాసులు అభినందించారు. ద్వితీయ సంవత్సరం ఫలితాలు వారు తెలియజేశారు. సీఈసీ గ్రూపునకు చెందిన బి. ఇందుకు 1000కి 746 మార్కులు సాధించి కళాశాల టాపర్‌వగా నిలిచింది. సీఈసీకి చెందిన సీహెచ్ కీర్తన 1000కి 722 మార్కులతో ద్వితీయ స్థానం సాధించింది. బైపీసీ విద్యార్థిని ఏ.…