భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: పసుపు ప్రాసెసింగ్ యూనిట్‌ను సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్ భూక్య వీరన్న నాయక్ రైతులకు సూచించారు. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలంలోని దుర్గా భవాని తండ గ్రామ పంచాయతీ పరిధిలోని పీన్యతండాలో ప్రజా పాలన 99 రోజుల యాక్షన్ ప్లాన్‌లో భాగంగా స్పైసెస్ బోర్డ్ క్యుజిబిజి పథకం కింద రూ.1.57 లక్షలతో సెర్ఫ్, ఇక్రిసాట్ సంస్థల సాంకేతిక సహకారంతో ఏర్పాటు చేసిన పసుపు డబుల్ డ్రం పాలిషర్ యూనిట్‌ను సర్పంచ్ వీరన్న నాయక్ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచి…
ప్రాసెసింగ్ యూనిట్ సద్వినియోగం చేసుకోవాలి: సర్పంచ్





