భారత్ సమాచార్.నెట్, నిర్మల్: పత్తి పంట కొనుగోలు ప్రక్రియను నిర్ణీత సమయానికి, పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రైతులకు వారి పంటకు ఖచ్చితంగా మద్దతు ధర అందించాలని స్పష్టం చేశారు.

కొనుగోళ్లకు సంబంధించి ఆన్‌లైన్ స్లాట్ బుకింగ్ కోసం ‘కపాస్ కిసాన్ యాప్’ను తప్పనిసరిగా వినియోగించాలని, దీనిపై రైతులకు విస్తృత అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని తెలిపారు. జిన్నింగ్ మిల్లుల్లో అగ్నిమాపక పరికరాలు, స్టాంపింగ్…