భారత్ సమాచార్, మెదక్ జిల్లా: రామాయంపేట కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని శుక్రవారం మెదక్ ఆర్డీవో రమాదేవి, తహసీల్దార్ రజనీకుమారి ఆకస్మికంగా సందర్శించారు. వారు పాఠశాలలోని వంట గదిని, నిత్యావసర సరుకుల నిల్వలను క్షుణ్ణంగా పరిశీలించారు. విద్యార్థులకు వడ్డిస్తున్న భోజనాన్ని రుచి చూసి, మెనూ ప్రకారం నాణ్యమైన ఆహారాన్ని అందించాలని వార్డెన్, వంట సిబ్బందిని ఆదేశించారు. కార్యక్రమంలో ఆర్ఐ గౌస్, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.






