భారత్ సమాచార్, మంచిర్యాల జిల్లా: గ్రామాల అభివృద్ధిలో వార్డు సభ్యుల పాత్ర కీలకమని బెల్లంపల్లి డీల్పీవో సతీష్ కుమార్ అన్నారు. నూతనంగా ఎన్నికైన 15 జీపీల వార్డు సభ్యులకు 5 రోజుల శిక్షణ కార్యక్రమాన్ని మంగళవారం తాండూర్ మండలంలోని కొత్తపల్లి రైతువేధికలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వార్డుమెంబర్లకు పంచాయతీరాజ్ వ్యవస్థ కీలక మైన బాధ్యతలు కట్టబెట్టిందన్నారు. వార్డుల్లో సమస్యలు గుర్తించి పరిష్కరించడంలో చురుగ్గా వ్యవహరించాలని సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు చేరేలా కృషి చేయాలన్నారు.…