భారత్ సమాచార్, మెదక్ జిల్లా: నర్సాపూర్ నియోజకవర్గంలో నూతనంగా ఎన్నికైన సర్పంచులు ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా గ్రామాల అభివృద్ధి కోసం సమిష్టిగా కృషి చేయాలని నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి ఆవుల రాజిరెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం నర్సాపూర్ క్యాంప్ కార్యాలయంలో తనను కలిసిన సర్పంచులను ఆయన శాలువాలతో సత్కరించి, శుభాకాంక్షలు తెలిపారు.

అనంతరం రాజిరెడ్డి మాట్లాడుతూ.. గ్రామాల సర్వతోముఖాభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయడంలో సర్పంచులు కీలక పాత్ర పోషించాలని సూచించారు. ప్రజల నమ్మకాన్ని…