భారత్ సమాచార్, మెదక్ జిల్లా: అగ్నిమాపక సిబ్బంది సేవలు అభినందనీయం అని రామాయంపేట మున్సిపల్ చైర్‌పర్సన్ లావణ్య నాగరాజు అన్నారు. రామాయంపేట, అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా రామాయంపేట మున్సిపల్ పరిధిలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ గజవాడ లావణ్య నాగరాజు పాల్గొన్నారు. ఈనెల 14 నుండి 21 వరకు నిర్వహించనున్న అగ్నిమాపక వారోత్సవాల గోడపత్రిక ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా అగ్నిమాపక సిబ్బంది అందిస్తున్న సేవలను ఆమె కొనియాడారు. ప్రజల ప్రాణాలు, ఆస్తులను రక్షించడంలో అగ్నిమాపక శాఖ కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు.
…
అగ్నిమాపక సిబ్బంది సేవలు అభినందనీయం





