భారత్ సమాచార్, వెబ్‌డెస్క్: తెలంగాణ ‘వనజీవి’గా పేరు గాంచిన పద్మశ్రీ అవార్డు గ్రహీత దరిపల్లి రామయ్య జీవిత చరిత్ర సినిమా రూపంలో తెరకెక్కనుంది. ఖమ్మం నగరంలోని బల్లేపల్లిలోని నేచరా వ్యాలీలో ఈ బయోపిక్ షూటింగ్ ను లాంఛనంగా ప్రారంభించారు. వనజీవి రామయ్య తన జీవితాన్ని లక్షలాది మొక్కలను నాటడానికి, రక్షించడానికి అంకితం చేసిన విషయం తెలిసిందే.
ఆయన ఆదర్శవంతమైన, నిరాడంబర జీవన విధానం, పర్యావరణ భక్తిని ఈ సినిమా వెండితెరపైకి తీసుకురానుంది. లీడ్ రోల్లో టాలీవుడ్ ప్రముఖ సీనియర్ నటుడు బ్రహ్మాజీ కనిపించనున్నాడు. నంది…





