భారత్ సమాచార్, నంద్యాల జిల్లా: నంద్యాల పట్టణంలో పేదల ఆకలి తీర్చే ఉద్దేశంతో శ్రీ విశాలక్షి పథకాన్ని ప్రారంభించినట్లు కార్యక్రమ నిర్వాహకులు, సీనియర్ పాత్రికేయులు నూర్ బాషా తెలిపారు. నంద్యాల వాసి, ప్రముఖ వ్యాపారవేత్త గోళ్ళ రాజేష్ ఆర్థిక సహకారంతో రూపాయికే వెజిటబుల్ పలావ్, కర్రీ అందిస్తున్నట్లు చెప్పారు. నంద్యాల మున్సిపల్ కార్యాలయం ఎదురుగా, సంఘమిత్ర బాలుర గృహం సమీపంలో ఏర్పాటు చేసిన వెజిటబుల్ పలావ్ కౌంటర్‌ను కూరగాయల మార్కెట్ ప్రసాద్, ఏపీయుడబ్లుజె జిల్లా కార్యదర్శి ఉస్మాన్ బాషా, నంద్యాల ఏపీయుడబ్లుజె ఉపాధ్యక్షులు…