భారత్ సమాచార్, నల్లగొండ జిల్లా: త్రిపురారం మండలం రాగడప గ్రామంలో పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలనే ఉద్దేశ్యంతో గ్రామ సర్పంచ్ సఫియా బేగం బుధవారం గ్రామంలోని వీధులలో ఉన్న మురికి కాలువలో పూడికతీత పనులు నిర్వహించారు. స్థానిక సిబ్బంది, కూలీలతో డ్రైనేజీలో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని తీయించారు. ప్రజలంతా తమవంతు బాధ్యతగా పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఈ సందర్భంగా తెలిపారు. వారి వెంట గ్రామ పంచాయతీ సిబ్బందితోపాటు, గ్రామస్తులు ఉన్నారు.
పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి: సర్పంచ్ సఫియా బేగం





