భారత్ సమాచార్, కర్నూలు జిల్లా: పదవ తరగతి మంచి భవిష్యత్తుకు పునాదని, విద్యార్థులు కష్టపడి చదివి మంచి మార్కులు సాధించాలని జిల్లా కలెక్టర్ డా. ఏ.సిరి అన్నారు. బుధవారం కల్లూరు మండలం ఏ. గోకులపాడు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 100 రోజుల ప్రణాళికను సమర్థవంతంగా అమలు చేసి 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలని హెడ్ మాస్టర్‌కు సూచించారు. సి, డి గ్రేడ్ విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ…