భారత్ సమాచార్, కర్నూలు జిల్లా: మంత్రాలయం మండలం వీ.తిమ్మాపురం గ్రామంలో అసంపూర్తిగా ఉన్న గ్రామ చావిడి నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేయాలని సీపీఐ జిల్లా నేత భాస్కర్ యాదవ్ డిమాండ్ చేశారు. బుధవారం ఈ విషయమై సంబంధిత అధికారులకు వినతిపత్రం అందజేశారు. గ్రామ చావిడి నిర్మాణ పనులు ఇప్పటికే సుమారు 60 శాతం పూర్తయ్యాయని తెలిపారు. మిగిలిన 40 శాతం పనులు నిధుల లేమితో నిలిచిపోయాయని పేర్కొన్నారు. ఈ కారణంగా గ్రామస్తులు తీవ్ర అసౌకర్యాలు ఎదుర్కొంటున్నారని అన్నారు. గ్రామాభివృద్ధికి చావిడి ఎంతో అవసరమని…