భారత్ సమాచార్, కర్నూలు జిల్లా: జిల్లాలో సోషల్ వెల్ఫేర్ అసిస్టెంట్ల పని ప్రశంసనీయమని జిల్లా సోషల్ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ రాధిక తెలిపారు. పత్తికొండలోని సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహంలో పదో తరగతి విద్యార్థులతో సమావేశమై ఉత్తీర్ణత పెంపుపై సూచనలు ఇచ్చారు. అనంతరం వెల్ఫేర్ అసిస్టెంట్లు ఆమెను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. గ్రామస్థాయిలో అభివృద్ధి, పథకాల అమలులో వెల్ఫేర్ అసిస్టెంట్ల పాత్ర కీలకమని ఆమె అన్నారు.
వెల్ఫేర్ అసిస్టెంట్ల పని భేష్ : రాధిక





