భారత్ సమాచార్, కర్నూలు జిల్లా: గడివేముల మండలం చింతకూరులో నిర్వహించిన జిల్లాస్థాయి అండర్–17 కబడ్డీ ఓపెన్ టోర్నమెంట్‌లో కౌతాళం మండలం ఏరిగేరి జడ్పీహెచ్ఎస్ విద్యార్థులు సత్తా చాటారు. సుమారు 56 జట్లు పాల్గొన్న ఈ పోటీల్లో ఏరిగేరి జట్టు అద్భుత ప్రదర్శన కనబర్చి విజేతగా నిలిచింది. ఫైనల్‌లో వెలుగోడు జట్టుపై 34–27 పాయింట్ల తేడాతో విజయం సాధించి ట్రోఫీని కైవసం చేసుకుంది. వరుసగా ఆరు మ్యాచ్‌ల్లో గెలిచి ఛాంపియన్‌గా నిలిచిన విద్యార్థులను, కోచ్ రామును ప్రధానోపాధ్యాయులు రమేష్ నాయుడును జిల్లా విద్యాశాఖ అధికారులు,…
కబడ్డీ పోటీల్లో సత్తా చాటిన ఏరిగేరి జడ్పీహెచ్ఎస్ జట్టు





