భారత్ సమాచార్, కర్నూలు జిల్లా: రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పారదర్శకంగా, వేగవంతంగా సేవలు అందించాలని, నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి రిజిస్ట్రేషన్ అధికారులను ఆదేశించారు. మంగళవారం అబ్బాస్‌నగర్‌లోని కర్నూలు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సేల్‌డీడ్‌ల స్వీకరణ, డాక్యుమెంట్ల నమోదు విధానం, రిజిస్ట్రేషన్ ప్రక్రియ, ఫైళ్ల భద్రత, కంప్యూటరైజ్డ్ ఎంట్రీలు, ప్రజలకు అందుతున్న సేవల తీరును స్వయంగా పరిశీలించారు. డబుల్ రిజిస్ట్రేషన్ వంటి లోపాలు జరగకుండా ఈసీ వెరిఫికేషన్‌తో…