భారత్ సమాచార్.నెట్, తిరుమల: తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు మరింత మెరుగైన వసతులు కల్పిస్తామని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. స్వామివారి దర్శనం కోసం భక్తులు ఎక్కువ సమయం వేచి చూడకుండా దర్శన ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గంలో వచ్చే భక్తులకు మరింత మెరుగైన వసతులు కల్పిస్తామన్నారు. అలాగే వసతి గదుల కోసం వేచి ఉండే భక్తులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేయనున్నట్లు తెలిపారు.
అలాగే ఒంటిమిట్ట రామాలయంలో అన్నప్రసాద వితరణ కోసం రూ.4.35 కోట్ల నిధులను కేటాయించినట్లు…





