భారత్ సమాచార్.నెట్, తిరుమల: కలియుగ ప్రత్యేక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకునేందుకు నిత్యం వేలాది మంది భక్తులు తరలివస్తుంటారు. శ్రీవారి దర్శనం కోసం కొందరు భక్తులు గంటల తరబడి వేచి ఉంటారు. మరికొంత మంది త్వరగా దర్శనం చేసుకోవాలని దళారులను ఆశ్రయిస్తుంటారు. ఈ క్రమంలోనే అలాంటి భక్తుల కోసం టీటీడీ కీలక ప్రకటన చేసింది. దర్శనానికి విచ్చేసే భక్తులు దళారులను ఆశ్రయించవద్దని టీటీడీ విజ్ఞప్తి చేసింది.

 

టీటీడీకీ సంబంధించిన అధికారిక వెబ్‌సై‌ట్‌లో ఆన్‌లైన్ ద్వారా లేదా టోకెన్ జారీ కౌంటర్ల ద్వారా…