భారత్ సమాచార్, మెదక్ జిల్లా: చేసిన అప్పులు తీర్చలేక పురుగులమందు తాగి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం బ్రాహ్మణపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని విఠల్ తండాలో జరిగింది. ఎస్సై రంజిత్ కుమార్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. నున్సావత్ భిక్షపతి అప్పులు చేసి డీసీఎం కొనుగోలు చేశాడు. చేసిన అప్పులు చెల్లించలేక తీవ్ర మనోవేదనకు గురై ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.