భారత్ సమాచార్.నెట్, హైదరాబాద్: తెలంగాణలో మార్వాడీ గోబ్యాక్, గుజరాతీ గోబ్యాక్ ప్రచారంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు. హైదరాబాద్ యూసుఫ్‌గూడలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావుతో కలిసి తిరంగా ర్యాలీని బండి సంజయ్ ప్రారంభించి మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో కమ్యునిస్టుల ముసుగులో కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు కలిసి చేస్తున్న డ్రామాలని ఫైర్ అయ్యారు. హిందూ సమాజాన్ని చీల్చే కుట్రలో భాగంగా ఈ ప్రచారం తెరమీదకు తెస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. మీరు మర్యాడీ గోబ్యాక్ ఉద్యమాలు…