భారత్ సమాచార్, కర్నూలు జిల్లా: ఆదోని పట్టణంలో బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో వడ్డే ఓబన్న జయంతోత్సవం ఘనంగా నిర్వహించారు. ఆలూరు నియోజకవర్గం ఇంచార్జ్ వడ్డే నాగేంద్ర అధ్యక్షతన భాస్కర్ రెడ్డి కాలనీలో ఈ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న బీఎస్పీ కర్నూలు జిల్లా ప్రధాన కార్యదర్శి మలిగే రామలింగయ్య మాట్లాడుతూ.. వడ్డే ఓబన్న స్ఫూర్తితో ప్రజలు తమ హక్కుల కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. వడ్డే ఓబన్న స్వతంత్ర సమరయోధుడిగా బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన మహోన్నత వ్యక్తి అని ఆయన…