భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: మండల కేంద్రం ఇనుగుర్తిలో ఆదివారం బోనాల జాతర నిర్వహించనున్న నేపథ్యంలో స్థానిక వాగ్దేవి కాన్సెప్ట్ స్కూల్లో శుక్రవారం ముందస్తుగా బోనాల వేడుకలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థినీ, విద్యార్థులు పోతరాజుల వేషధారణతో పాటు శివశక్తుల వేషాల్లో ఆకట్టుకున్నారు. డప్పు చప్పుళ్ల మధ్య బాలబాలికలు బోనాలను ఎత్తుకుని ఉత్సాహంగా పాల్గొనడంతో పాఠశాలలో భక్తి భావం ఉట్టిపడింది.
బోనాల వేడుకల్లో భాగంగా విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో పాల్గొని పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చారు. బోనాలను ఎత్తుకుని భక్తిశ్రద్ధలతో ప్రదర్శన నిర్వహించడంతో పాఠశాల ప్రాంగణం…





