భారత్ సమాచార్, కర్నూలు జిల్లా: భారతీయ జనతా పార్టీ జిల్లా ఆధ్వర్యంలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి శత జయంతి సందర్భంగా శుక్రవారం ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో ‘అటల్–మోదీ సుపరిపాలన యాత్ర’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు పి.వి.ఎన్. మాధవ్, వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కర్నూలు జిల్లా బీజేపీ అధ్యక్షుడు అక్కమ్మతోట రామకృష్ణ, మాజీ ఎంపీ టీజీ వెంకటేష్ కూడా పాల్గొన్నారు. రాష్ట్ర, జిల్లా, మండల నాయకులు,…