భారత్ సమాచార్, కర్నూలు జిల్లా: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉపాధి హామీ పథకాన్ని క్రమంగా నిర్వీర్యం చేస్తున్నాయని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు వీరశేఖర్ తీవ్రంగా మండిపడ్డారు. శనివారం దేవనకొండలో నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడారు. గ్రామీణ పేదల జీవనాధారమైన ఈ పథకాన్ని బలోపేతం చేయాలని డిమాండ్ చేశారు. ప్రతి కుటుంబానికి 200 రోజుల పని కల్పించాలని, ప్రస్తుతం ఉన్న కూలీని పెంచి రోజుకు రూ.600 ఇవ్వాలని కోరారు. పథకం పేరు మార్చే ప్రయత్నాలు వెంటనే నిలిపివేయాలని, నిధుల భారాన్ని…