భారత్ సమాచార్, మెదక్ జిల్లా: తెలంగాణ రాష్ట్రంలోని బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం పట్ల కాంగ్రెస్ పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. నర్సాపూర్ పట్టణంలో మంగళవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన విజయోత్సవ ర్యాలీలో నాయకులు పాల్గొని పెద్దఎత్తున సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ సువాసినిరెడ్డి, నర్సాపూర్ నియోజకవర్గ ఇంఛార్జి ఆవుల రాజిరెడ్డి, జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్, కాంగ్రెస్ యూనియన్ నాయకులు నవీన్ గుప్,తా బండారి గంగాధర్, మణిదీప్, కార్యకర్తలు తదితరులు…