భారత్ సమాచార్, మెదక్: నర్సాపూర్ రైతు వేదికలో రైతు వేడుక కార్యక్రమం మంగళవారం జరిగింది. ఈ  కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వ్యవసాయ శాస్త్రవేత్తలు తెల్ల దోమ నివారణ గురించి తెలియజేశారు. తెల్ల దోమ నివారణ గురించి ఏ మందులు ఏ సమయానికి వాడాలో వ్యవసాయ శాస్త్రవేత్తలు రైతులకు వ్యవసాయ అధికారులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారులు దీపిక, ఝాన్సీ, సంధ్యారాణి, తెలంగాణ రైతు రక్షణ సమితి ముఖ్య సలహాదారుడు మిరియాల చంద్రశేఖర్ గుప్తా పాల్గొన్నారు.