భారత్ సమాచార్, ప్రకాశం జిల్లా: గ్రామ రెవెన్యూ సహాయకుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కనిగిరి మండల వీఆర్ఏల సంఘం నాయకులు మంగళవారం ఆర్డీవో కార్యాలయంలో వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా సంఘ మండల అధ్యక్షులు పి ఏడుకొండలు, సిఐటియు జిల్లా నాయకులు పిసికేశవరావులు మాట్లాడుతూ గ్రామ రెవిన్యూ సహాయకులకు తగిన వేతనాలు, హోదాలు ఇవ్వాలన్నారు. ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్న వారిని పర్మినెంట్ చేయాలన్నారు. అటెండర్‌, నైట్‌ వాచ్‌మెన్ ప్రమోషన్ కోటాను పెంచాలన్నారు. అక్రమ డ్యూటీలు రద్దు చేసి డ్యూటీల కేటాయింపులో న్యాయం చేయాలన్నారు.…