భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: నీటి వనరులను సంరక్షిస్తూ భూగర్భ జలాల మట్టాన్ని పెంచేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని బ్రాహ్మణ కొత్తపల్లి సర్పంచి చిర్ర యాకాంతం గౌడ్ పిలుపునిచ్చారు. నెల్లికుదురు మండలం బ్రాహ్మణ కొత్తపల్లిలో మంగళవారం గ్రామపంచాయతీ కార్యాలయంలో ఆయన అధ్యక్షతన ప్రత్యేక గ్రామసభ నిర్వహించారు. గ్రామాభివృద్ధి, నీటి సంరక్షణ, మహిళల భద్రత వంటి పలు కీలక అంశాలపై గ్రామసభలో చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు.
సర్పంచి యాకాంతం గౌడ్ మాట్లాడుతూ ప్రతి రైతు తమ వ్యవసాయ భూముల్లో పంట గుంతలు, ప్రతి కుటుంబం…





