భారత్ సమాచార్, మేడ్చల్ జిల్లా: జన్మూరం కాలనీ వాసులు నీటి సమస్యతో ఖాళీ బిందెలతో కీసర సర్కిల్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. పలుమార్లు అధికారులకు విన్నవించిన సమస్య పరిష్కారం కాలేదని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం డిప్యూటీ కమిషనర్ ఎన్ వసంత ను కలిసి వినతిపత్రం అందజేశారు. జన్నారం కాలనీలో నెలకొన్న తీవ్ర త్రాగునీటి ఎద్దడిని వెంటనే పరిష్కరించి క్రమం తప్పకుండా నీటి సరఫరా చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమాల్లో జన్నూరం కాలనీ ప్రెసిడెంట్ కిషన్ సంపత్,…