భారత్ సమాచార్, వనపర్తి జిల్లా: మున్సిపల్ ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీ సమర శంఖారావాన్ని పూరించింది. వనపర్తి పట్టణంలో ఎమ్మెల్సీ, వనపర్తి మున్సిపల్ ఎన్నికల ఇంచార్జ్ స్వామి గౌడ్, మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ మోటార్ సైకిల్ ర్యాలీని చేపట్టారు. మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడటానికి ముందే పట్టణంలో పెద్ద ఎత్తున నిర్వహించిన మోటార్ సైకిల్ ర్యాలీ ఊహించని రీతిలో విజయవంతమైంది. అనుకున్న దాని కంటే కార్యకర్తలు అత్యధిక సంఖ్యలో హాజరు కావడంతో గులాబీ శ్రేణులంతా తబ్బిబ్బయ్యారు. అనంతరం…