భారత్ సమాచార్, కర్నూలు జిల్లా: జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షులు జి.కబర్థి సూచనల మేరకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకట శేషాద్రి పురుషుల జిల్లా కారాగారం, మహిళా కారాగారాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జడ్జి ప్రిజన్ లీగల్ ఎయిడ్ క్లినిక్ ను పరిశీలించి జైలు ఖైదీలకు అందించే న్యాయ సేవల గురించి వివరించారు. ఈ క్లినిక్స్‌లో ఒక న్యాయవాది, ఒక ప్యారా లీగల్ వాలంటీర్ ఉంటారని, వారు ఖైదీలకు ఉచిత న్యాయ సహాయం…