భారత్ సమాచార్.నెట్, శ్రీకాకుళం: పలాస-కాశీబుగ్గ జంట పట్టణాల్లోని వ్యాపార దుకాణాల్లో తూనికల కొలతలశాఖ అధికారులు మంగళవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించి 14 కేసులు నమోదు చేశారు. తూకాల్లో తేడాలు వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా అసిస్టెంట్ కమిషనర్ పి.చిన్నమ్మ హెచ్చరించారు. కిరాణా, చికెన్, మాంసం, చేపల షాపులతోపాటు ఫ్రూట్ షాప్, హార్డ్‌వేర్, ఫర్నిచర్ దుకాణాల్లో తనిఖీలు చేశారు. వినియోగదారులకు సరైన తూకం ఇవ్వాలని ఆమె సూచించారు. కాటాలకు ప్రతి సంవత్సరం ప్రభుత్వ ముద్రలు తప్పనిసరిగా వేయించుకోవాలని వ్యాపారులకు తెలిపారు. తూకాల్లో అవకతవకలకు…
దుకాణాల్లో తూనికల కొలతలశాఖ తనిఖీలు.. 14 కేసులు నమోదు





