భారత్ సమాచార్ నెట్, కర్నూలు : సంక్షేమ వసతి గృహాలు సమర్థవంతంగా పనిచేయాలని, విద్యార్థుల చదువు, ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని బీసీ వెల్ఫేర్ శాఖ ఎక్స్-అఫీషియో కార్యదర్శి ఎస్. సత్యనారాయణ అధికారులను ఆదేశించారు. కర్నూలులో నిర్వహించిన అవగాహన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వసతి గృహాల్లో మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలని, స్టడీ అవర్స్ నిర్వహించి 100% ఉత్తీర్ణత సాధించేలా కృషి చేయాలని సూచించారు.
విధుల పట్ల నిర్లక్ష్యం వహించే సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని…



