భారత్ సమాచార్, పశ్చిమగోదావరి జిల్లా: పశ్చిమగోదావరి జిల్లాలో ఆదివారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఇరగవరం మండలం అయితంపూడి లాకుల సమీపంలో అదుపుతప్పిన కారు నరసాపురం పంట కాలువలోకి దూసుకెళ్లిన ఘటనలో నలుగురు ఇంజినీరింగ్ విద్యార్థులు మృతి చెందగా.. మరో విద్యార్థి గల్లంతయ్యాడు. ఈ ప్రమాదంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, పశ్చిమగోదావరి జిల్లాలకు చెందిన ఐదుగురు విద్యార్థులు గల్లంతయ్యారు. ఆదివారం సాయంత్రానికి నలుగురి మృతదేహాలను సహాయక బృందాలు వెలికితీశాయి. మరో విద్యార్థి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
మృతుల్లో కోనసీమ జిల్లా మలికిపురం…


