భారత్ సమాచార్, వెబ్‌డెస్క్: సయాటికా అనేది నడుము నుంచి కాళ్ల వరకు వ్యాపించే నరములో ఒత్తిడి పెరగడం వల్ల కలిగే నొప్పి. ఈ నొప్పి రోజువారీ జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. అయితే సరైన జాగ్రత్తలు తీసుకుంటే ఉపశమనం పొందవచ్చు. తీవ్రమైన నొప్పి వచ్చిన తొలి రెండు రోజులలో స్వల్ప విశ్రాంతి తీసుకోవడం మంచిది. కానీ పూర్తిగా పడుకోకుండా, చిన్నచిన్న కదలికలను కొనసాగించడం అవసరం. నొప్పి సహనమయ్యే స్థాయిలో నెమ్మదిగా నడవడం ద్వారా కండరాలు చురుకుగా ఉంటాయి. ఇది రక్తప్రసరణను మెరుగుపరచి నొప్పి తగ్గటానికి…