భార‌త్ స‌మాచార్‌.నెట్, కృష్ణా: మహిళలకు ఆర్థిక పరిపుష్టి కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. మచిలీపట్నం ఆర్టీసీ డిపోలో శుక్రవారం ‘స్త్రీ శక్తి’ ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని ప్రారంభించి ఆయన మాట్లాడారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత సిలిండర్లు, తల్లికి వందనం వంటి పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు. ఈ పథకాల వల్ల లక్షల మంది మహిళలకు ఆర్థిక ప్రయోజనం కలుగుతుందన్నారు. ఉచిత బస్సు ప్రయాణంతో ప్రతి మహిళకు నెలకు…