భారత్ సమాచార్, కర్నూలు జిల్లా:  ప్రపంచ వికలాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదోని ఎంపీడీవో  కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించబడింది. టిడిపి రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ, ఆదోని మాజీ ఇంచార్జ్ గుడిసె ఆది కృష్ణమ్మ ముఖ్య అతిథిగా హాజరై వికలాంగుల సమస్యలపై అధికారులకు సూచనలు చేశారు. గుడిసె ఆది కృష్ణమ్మ మాట్లాడుతూ, వికలాంగులు సమాజంలో ముఖ్య భాగం అని, వారికి కావాల్సిన సౌకర్యాలు, అవకాశాలు, గౌరవం అందించడం ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు. పింఛన్ల పెంపు, సహాయక సాధనాల పంపిణీ, ప్రభుత్వ కార్యాలయాల్లో సౌకర్యాల ఏర్పాటు,…