భారత్ సమాచార్, కర్నూల్ జిల్లా: ప్రపంచ మత్స్య దినోత్సవం సందర్భంగా “మన చెరువు–మన చేప” కార్యక్రమం లో భాగంగా గాజులదిన్నె ప్రాజెక్టులో ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి చేప పిల్లలను వదిలారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మత్స్య రైతుల ఉత్పత్తిదారుల సంఘం కోసం కొత్త కార్యాలయ నిర్మాణానికి రూ.2.5 లక్షల నిధులు మంజూరయ్యాయని తెలిపారు. కార్యక్రమంలో ఫిషరీస్ డీడీ, ఎఈ, బెస్త కార్పొరేషన్ డైరెక్టర్, ఫిషరీస్ అసోసియేషన్ అధ్యక్షుడు, సభ్యులు, మత్స్యకారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.